Thugs Of Hindostan Movie in Telugu200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అమితాబ్ – అమీర్ – కత్రీనాల “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” సినిమాకు విమర్శకులు దారుణమైన రేటింగ్స్ తో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు అన్ని భాషలలో కలిపి దాదాపుగా 50 కోట్లు కొల్లగొట్టి ‘ఔరా’ అనిపించింది.

మౌత్ టాక్ సరిగా లేకపోయినా, విశ్లేషకుల రివ్యూలు దయనీయంగా ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమా ‘వన్ డే వండర్’ అన్న విషయం తేలిపోయింది. తొలిరోజు ఆ స్థాయిలో ఉన్న వసూళ్లు కాస్త రెండవ రోజు చెప్పుకోలేనంత స్థాయిలో పడిపోయాయి.

ఇక మూడవ రోజు అయితే ఆ పరిస్థితి ఇంకాస్త దిగజారడంతో ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పవని తేలిపోయింది. విడుదలకు ముందు ‘బాహుబలి’ స్థాయిలో హిట్టవుతుందని భావిస్తే, రిలీజ్ తర్వాత ‘బాహుబలి’ వన్ వీక్ కలెక్షన్స్ ను కూడా ఓవరాల్ గా టచ్ చేయలేని స్థాయిలో వసూళ్లు తగ్గిపోయాయి. అమీర్ ఖాన్ కెరీర్ లో భారీ ఫ్లాప్ మూవీగా ఈ సినిమా రికార్డులకెక్కుతోంది.