theri-polisodu-giving-tough-competition-to-sardaar-gabbar-singhతెలుగు తెరపై ఇప్పటివరకు చాలా మంది పోలీసులే కనపడ్డారు. అయితే పోలీసు పాత్రలు అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాత్రం ‘అంకుశం’ రాజశేఖర్, ‘పోలీస్ స్టోరీ’ సాయి కుమార్, ‘పోకిరి’ మహేష్ బాబు, ‘గబ్బర్ సింగ్’ పవన్ కళ్యాణ్ లు. ఆ జాబితాలో ఉన్న పవన్ మళ్ళీ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే ఈ సారి పవన్ చూపించాబోయే తిక్కకు తన లెక్క కూడా చూపిస్తాను అంటున్నాడు తమిళ హీరో విజయ్. తమిళంలో రూపొందిన “తేరి” సినిమాలు తెలుగులో ‘పోలీసోడు’గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రేక్షకులకు అందివ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘పోలీసోడు’ను చూస్తుంటే… పవన్ ‘సర్ధార్’ జ్ఞప్తికి రావడం సహజమే. స్టైలిష్ గన్ పట్టుకుని ఉన్న విజయ్ లుక్ ‘సర్ధార్’ మాదిరే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.