There is a TRS party in the AP and it also has a presidentతెలంగాణ కోసం పోరాడి ఆ తరువాత రాష్ట్రం వచ్చాకా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆంధ్ర వారి మీద తెరాస ఉద్యమ సమయంలో చేసిన తీవ్ర వ్యాఖ్యల గురించి తెలిసిందే. అటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక శాఖ ఉండటం దానికి పార్టీ అధ్యక్షుడు కూడా ఉండటం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అలజడి సృష్టించిన, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా నాయకురాలు బొడిగె శోభపై పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసు నమోదు అయింది. ప్రజా ఉద్యమంలో పాల్గొన్న ఆమె తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసిందని కంప్లైంట్ లో నమోదు చేశారు.

ఈ కంప్లయింట్ ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ, విజయవాడ సీపీ శ్రీనివాసులుకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సహజంగా ఇటువంటి కేసులు నమోదు కావడం అవి ఎటు కదలకపోవడం మాములే… నేతలు నాయకుల మెప్పు కోసమే ఇటువంటి కేసులు పెడుతుంటారు.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఉంది… దానికో అధ్యక్షుడు కూడా ఉన్నారు అంటూ బయటపడటం విశేషం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే… అసలు ఈ పార్టీ విభాగం తెరాస నియమించిందో లేదా ఆంధ్రప్రదేశ్ లోని కొందరు ఆ పార్టీ అభిమానులు తామే స్వయంగా ప్రకటించేసుకున్నారో తెలియాల్సి ఉంది.