the-vision-of-bharat-bharat-ane-nenuకొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన “భరత్ అనే నేను” విజన్ విడుదలైంది. సినిమాలో ఏం చూపించబోతున్నారో అనే విషయాన్ని ఈ టీజర్ లో స్పష్టంగా చెప్పేశారు. ‘చేసిన ప్రామిస్ ఎప్పటికి మరిచిపోకూడదు, మనం సమాజంలో బ్రతుకుతున్నాం… ప్రతి ఒక్కరికి బాధ్యత, భయం ఖచ్చితంగా ఉండాలి’ అనే సందేశాలను అండర్ కరెంట్ గా మహేష్ బాబు చేత కొరటాల చెప్పించబోతున్నారు.

యంగ్ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా కళ్ళజోడు పెట్టుకుని కారు దిగిన షాట్ అయితే ప్రిన్స్ అభిమానులకు ‘ఐ ఫీస్ట్’ అని చెప్పొచ్చు. గత రెండు సినిమాలలో ఫ్యాన్స్ ఏం మిస్ అయ్యారో, వాటిని అందిస్తూ… కంటెంట్ కు ప్రాధాన్యమిస్తూ కొరటాల “భరత్ అనే నేను”ను రూపకల్పన చేసారు. ముఖ్యమంత్రిగా ప్రిన్స్ సీరియస్ నెస్ డైలాగ్స్ కొరటాల మార్క్ ను ప్రతిబింబిస్తున్నాయి.

ప్రొడక్షన్ వాల్యూస్, ఫోటోగ్రఫీ, సంగీతం… అన్నీ ‘శ్రీమంతుడు’ మాదిరే కంటెంట్ కు తగ్గ విధంగా ఉన్నాయి. అయితే ఈ టీజర్ లో ఎక్కువ షాట్స్ ‘శ్రీమంతుడు’ సినిమాలో మాదిరి కనపడుతున్నా… కధాబలం ఉన్న కంటెంట్ లా కనపడుతుండడంతో, విమర్శలను పక్కన పెట్టేలా చేసింది. మొత్తానికి గత కొన్ని రోజులుగా ఎదురుచూసిన ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు ఈ టీజర్ ‘ప్రామిసింగ్’గా కనపడుతుంది.