The Telangana govt stopping ambulances from other states especially from Andhra Pradeshఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాంతానికి వివక్ష అంటూ జరిగిన పోరాటం కారణంగా తెలంగాణ రాష్ట్రం రియాలిటీగా మారింది. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలలో తాము వివక్షకు లోనయ్యామని భావన తో ఉండటంతో… వాయఱి పోరాటానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. అయితే, తెలంగాణ సాకారమయ్యాకా ప్రాంతీయతకు చోటు లేకుండా ఉంది.

అయితే కరోనా సంక్షోభం ప్రాంతీయ తేడాలను తిరిగి తెస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల (ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి) అంబులెన్స్‌లను ఆపినందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ఆ జీవో పై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి… దానిని కొట్టివేసింది.

ఆ తరువాత హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల ప్రజలు 45% పడకలను ఆక్రమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై సోషల్ మీడియా లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మన సొంత ప్రజలు చనిపోతున్నప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్‌లో పడకలను ఆక్రమించటానికి ప్రభుత్వం ఎలా అనుమతించగలదని కొందరు అంటున్నారు.

కొందరు అయితే ఏపీ ప్రజల మీద ఘోరంగా పోస్టులు పెడుతున్నారు. ఈ ధోరణి నెమ్మదిగా ప్రాంతీయ ద్వేషానికి దారితీస్తోంది. ఒక పెద్ద మెట్రో నగరం ఉన్నప్పుడు ఇది సర్వసాధారణం. ఢిల్లీ, బెంగళూరు, ముంబై లో ఇదే పరిస్థితి. హైదరాబాద్ లో కేవలం ఏపీ పేషెంట్లు మాత్రమే కాదు అనేక రాష్ట్రాల వారు ఉన్నారు. ఏపీ విషయం మాత్రమే కనిపిస్తుంది. ఇది ప్రజల మధ్య శత్రుత్వానికి కారణం కాకూడదు. ఈ సంక్షోభంలో దేశం ఐక్యంగా ఉండాలి.