The story of DSPs told by Ys Jagan “దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో మప్పైఐదు మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన….” అంటూ దేశ రాజధాని నడిబొడ్డున రాజేంద్రనాధ్ రెడ్డి, సుబ్బారెడ్డి, వేమిరెడ్డి, రాజమమూహన్ రెడ్డి, రవిచంద్రారెడ్డి తదితర పార్టీ నాయకులతో కలిసి ఆరోపణలు చేస్తూ, ఢిల్లీ చలిలో రాజకీయ వేడి రగిలించారు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ రెడ్డి. సిఐలకు డియస్పీలుగా పదోన్నతుల్లో ఒకే వర్గం వారికి అవకాశం కల్పించారనేది ఆ ఆరోపణ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి బయటకు వచ్చి రాజేంద్రనాద్ రెడ్డి ఇచ్చిన లిస్టు చూపించి, ఔను ఔను అంటూ బుగ్గన తలాడింపుల మద్య “ఔట్ ఆఫ్ టర్న్ ప్రమెూషన్లు 37 మందిలో 35 మంది అంతా ఒకే సామాజిక వర్గం, మిగిలిన ఇద్దరిలో కూడా ఒకరు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెండ్లి తేసుకున్న పరిస్థితి.. అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థను బ్రష్టు పట్టిస్తా ఉన్నాడు….’ అంటూ నిప్పులు కురిపించారు. ఆ ప్రమెూషన్ల లిస్టు ఏంటో, అందులో పేర్లు ఏవో కనీసం సొంత మీడియాల్లో కూడా ఇవ్వనంత చిదంబర రహస్యంగా ఉంచారు. బహుశా జగన్ రెడ్డి పబ్లిక్ గా తనకున్న కులద్వేషాన్ని ప్రదర్శించిన తొలి సందర్భం అదేనేమెూ.

ఊహించని ఈ ఆరోపణలకు అప్పటి అధికార తెలుగుదేశం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. అసలు ఎవరి గురించి చెబుతున్నారో, ఏ ప్రమెూషన్లో అర్థంకాక తేరుకుని ప్రమెూషన్ల వివరాలు చెప్పే లోపలే జగన్ రెడ్డి తన సొంత మీడియా, పార్టీ సోషల్, అనుకూల వెబ్ మీడియాలతో దీనిని ప్రపంచం చుట్టించారు. ఆ కృషి ఫలించి, అధికారం చేతికొచ్చిన మీ డేళ్ళ తరువాత, జనాలు ఆ విషయం మరిచిపోయాక, చల్లగా ఆనాడు చేసిన ప్రచారం కట్టుకథలు, అబద్దాలు అనే విధంగా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు తమ హోం మంత్రితో సమాధానం ఇప్పించారు. దాని ప్రకారం జగన్ రెడ్డి ఆరోపించిన వర్గం వారు 37 మందిలో కేవలం 5గురు, బిసిలు 12 మంది, యస్సీలు 6 మంది, ఆయన సొంత రెడ్డి వర్గానికి చెందిన వారు ముగ్గురు. అంటే దాదాపు ఆ వర్గపు అధికారులకు ఇచ్చిన ప్రమెూషన్లకు 600 రెట్లు పెంచి దేశ రాజధానిలో పచ్చి అబద్దపు ప్రచారాలు చేసారు. అదే అబద్దాలతో ఆనాడు రాజ్యాంగ బద్దమైన ఎన్నికల సంఘానికి, గవర్నర్ కు కూడా వినతి పత్రం ఇచ్చారు.

Also Read – హైద్రాబాద్ పై ఉమ్మడి హక్కు కు కాలం చెల్లనుందా..?

అటువంటి అబద్దపు ప్రచారాలతో ఆ ఎన్నికలు నెగ్గిన జగన్, అధికారం వచ్చాక ఆనాడు చేసిన ఆరోపణలు తన విషయంలో నిజం చేసి చూపిస్తున్నారు. వస్తూనే తన వర్గపు వ్యక్తులను వేయి మందికి పైగా నామినేటెడ్ పోస్టుల్లో నింపిన ఆయన, తాజాగా డియస్పీల పోస్టింగులలోనూ తన కుల మార్కు చూపించారు. 30 మందిలో 11 మంది అంటే దాదాపు 33% తన సొంత వర్గం అధికారులనే కీలక స్థానాల్లో నియమించారు. దాంతో ఇప్పుడు జగన్ గతంలో చేసిన ఆరోపణలు మరోసారి చర్చకు వచ్చాయి. ఇక ఎందరో అర్హత కలిగిన వారు ఉన్నా వారిని కాదని డిజిపిగా కూడా సొంత వర్గం అధికారినే నియమించకున్నారు. ఇవి కాక ఇప్పటికే ఆయా స్ధానాలలో ఉన్న వారితో కలిపి 19 మంది సొంత వర్గం అధికారులు ఉన్నారని, ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది. వాస్తవానికి ప్రభుత్వంలో కీలక విభాగాలన్నింటిలో సొంత వర్గపు అధికారులను నియమించారనే ఆరోపణలు గత రెండేళ్ళగా ఉన్నాయి. ఇవేకాక ఉద్యోగుల సంఘాల్లో కూడా అధికార పార్టీ అను’కుల’ వర్గం వారే నాయకులుగా చలామణి అవుతున్నారు. సలహాదారులుగా, యూనివర్సిటీల్లో, ప్రభుత్వ ప్లీడర్లుగా, మార్కెట్ యార్డులు, సహకార సంఘాలు ఇలా ‘ఎందెందు జూసినా అందందు…’ అనే విధంగా సొంత వర్గం నాయకులతో నింపేసారనే ఆరోపణలకు లెక్కేలేదు.

కులం చూడం, మతం చూడం అంటూ అందరితో నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ‘ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న విధంగా తన కులం తప్ప వేరే వారిని చూడం అనే రకంగా పాలన చేయడం ఏ రాజకీయ పార్టీకి, నాయకుడికి కూడా దీర్ఘకాలంలో మేలుచేయదని ఈయనకు ఎవరైనా హితవు చెప్పగలరో లేదో.

Also Read – రాజకీయ బలిపశువులుగా ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులు!

శ్రీకాంత్.సి

Also Read – హైదరాబాద్‌ మనకు అవసరమా?