The Predator trailer Talkఈ నెల 13వ తేదీన వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ లో మూడు తెలుగు సినిమాలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ధియేటర్లలో ప్రదర్శితం అవుతున్న ‘గీత గోవిందం’తో పాటు ఈ మూడు సినిమాలకే ధియేటర్లు సరిపోతాయో లేదోనని భావిస్తే, తాజాగా ఓ హాలీవుడ్ బొమ్మ అదే తేదీన విడుదల కానుంది.

‘ప్రెడేటర్’ సిరీస్ లో భాగంగా “ది ప్రెడేటర్’ పేరుతో విడుదల కానున్న ఈ సినిమా ఫైనల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ప్రెడేటర్’ సిరీస్ సినిమాలకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది, దీనిని వినియోగించుకునేందుకు వినాయకచవితిని వేదికగా ఎంచుకోవడం, పోటీని మరింత టఫ్ చేసింది.

ఉన్నంతలో ఊరటనిచ్చే విషయం ఏమిటంటే… తెలుగులో డబ్ చేయకుండా నేరుగా ఇంగ్లీష్ లో విడుదల చేస్తుండడం ప్రేక్షకులను పరిమితం చేయనుంది. రిలీజైన ఫైనల్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా కట్ చేయడం “ది ప్రెడేటర్”పై అంచనాలు ఏర్పడడానికి కారణమైంది. ప్రపంచ వ్యాప్తంగా 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ఇండియాలో ఒక రోజే ముందే ప్రత్యక్షం కానుంది.