The NUN - 'Telugu Trailer talkహాలీవుడ్ బొమ్మలు ఇండియన్ స్క్రీన్ పై బాగా సందడి చేస్తున్న నేపధ్యంలో… తాజాగా మరో సినిమా “ది నన్” రూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. హార్రర్ సినిమాలకు ఉండే క్రేజ్ రీత్యా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. “ది కంజురింగ్, అన్నాబెల్లె” వంటి హర్రర్ మూవీస్ ను రిఫర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేసారు.

ఓ నన్ ఫోటోను చూపిస్తూ… బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన “దాని వెనుక ఓ చరిత్ర ఉంది, అది ఎంతో భయంకరమైనది, ఓ అమానుష శక్తి ప్రాణం పోసుకుంది” అన్న డైలాగ్ సినిమా ఉద్దేశాన్ని చాటి చెప్పగా, చివర్లో వచ్చిన హార్రర్ షాట్ హాలీవుడ్ మార్క్ ను చూపించింది. తెలుగులోకి కూడా డబ్ అయిన ఈ సినిమాను సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నారు.