The Jungle Bookభారత్ బాక్సాఫీస్ వ‌ద్ద హాలీవుడ్ చిత్రం ‘ది జంగిల్ బుక్‌’ దుమ్ము దులిపేస్తోంది. అద్భుత గ్రాఫిక్స్ తో తెర‌కెక్కించిన ఈ చిత్రానికి ఇండియన్ సినీ ప్రేమికుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దేశంలో ఏ హాలీవుడ్ చిత్రానికీ రానంత స్పందన ‘ది జంగిల్ బుక్’ ద‌క్కించుకుంటోంది. భార‌త మార్కెట్లో ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుద‌లైన ఈ చిత్రం గత హాలీవుడ్ సినిమాల రికార్డులను దాటి సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు 148 కోట్ల రూపాయలను వ‌సూలు చేసిన ‘ది జంగిల్ బుక్’ మ‌రిన్ని క‌లెక్ష‌న్లు రాబట్టే దిశ‌గా దూసుకెళుతుండడం విశేషం. ఈ సినిమా హిందీ వర్షన్ కు బాలీవుడ్ నటులు ప్రియాంక చోప్రా, నానా పటేకర్, ఓం పురి, ఇర్ఫాన్, షేఫాలి షా వాయిస్ ఓవర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. సాహసం, వినోదం అంశాలతో కూడుకున్న ఈ సినిమా కథ 200 కోట్ల క్లబ్ లో చేరుతుందేమో చూడాలి.