Tharuvatha-Evaru-Theatrical-Trailerచిన్న సినిమాలను కూడా పెద్ద హిట్లు చేస్తోన్న రోజులివి. ఒకప్పటిలా ఓ ఆరు పాటలు, ఓ అయిదు ఫైట్లు, నాలుగు కామెడీ సీన్లు పెట్టేసి జనాల మీదకు వదిలేస్తే కలెక్షన్లు వచ్చే రోజులు కావు. అలాగే చూసిన స్టోరీలనే మళ్ళీ మళ్ళీ తీస్తే పెద్ద సినిమాలైనా కూడా మొహమాటం లేకుండా తిప్పికొడుతున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాలకు ప్రేక్షకులు ఇస్తోన్న ప్రాధాన్యత అలాంటిది.

ఈ క్రమంలో తాజాగా విడుదలైన “తరువాత ఎవరు” అనే ట్రైలర్ ప్రేక్షకులకు రీచ్ అవ్వడంలో సక్సెస్ కాలేకపోయింది. క్రైమ్ అండ్ హార్రర్ స్టోరీతో తెరకెక్కిన ఈ ట్రైలర్ లో… ఓ రియాలిటీ గేమ్ ఉండడం.., అందులో పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ చనిపోతుండడం… దీనిని పోలీసులు చేధిస్తుండడం… ఇలా రొటీన్ సన్నివేశాలతో నిండిపోయింది. దీంతో కొత్తదనం కొరవడిన ఈ ట్రైలర్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

సాంకేతికత పరంగా బాగానే ఉన్నప్పటికీ, కంటెంట్ పరంగా రొటీన్ గా అనిపిస్తోంది. బహుశా సిల్వర్ స్క్రీన్ పై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే గనుక ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావచ్చేమో గానీ, ఇలాంటి కంటెంట్ ను చాలా సార్లు హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రేక్షకులు రుచి చూసేసారు. టైటిల్ ‘తరువాత ఎవరు’ అని వినగానే ఆది ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా గుర్తుకు రావడం సహజమే!