యంగ్ టైగర్ కు కథ చెప్పిన యంగ్ డైరెక్టర్

Tharun Bhascker to direct jr ntr

యువదర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న మీకు మాత్రమే చెప్తా వచ్చే నెల 1న విడుదలకు సిద్ధం అవుతుంది. తరుణ్ విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. గుర్రపు స్వారీ నేపథ్యంలో జరిగే ఈ సినిమా సంక్రాంతికి ముహూర్తం జరుపుకుంటుంది. వచ్చే ఏడాది దసరాకు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ లోగా ఈ యువదర్శకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఒక లైన్ వినిపించాడట. అది ఎన్టీఆర్ కు కూడా బాగా నచ్చిందట. “లైన్ చెప్పా ఆయనకు కూడా నచ్చింది. అయితే పూర్తిగా డెవలప్ చెయ్యడానికి రెండు మూడు నెలలు పడుతుంది. ఆ తరువాత ఆయన ఏమని తేలుస్తారో చూడాలి,” అని తరుణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది రామ్ చరణ్ తో ఒక మల్టీ స్టారర్ చిత్రం. దీనిలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా 2020 రెండో భాగంలో గానీ విడుదల అవ్వదు. ఇంకా ఆలస్యమైనా చెప్పలేం. ఈలోగా ఎన్టీఆర్ ఎటువంటి కొత్త ప్రాజెక్టులు సైన్ చెయ్యడం లేదు.

అయితే తరుణ్ తో సినిమా పడితే మాత్రం అది మంచి ఇమేజ్ మేక్ ఓవర్ సినిమా అవుతుంది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం పై ఎన్టీఆర్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తరువాత తరుణ్ తో సినిమా చేస్తే అభిమానుల అంచనాలు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి.

Follow @mirchi9 for more User Comments
47 Days ZEE5 Telugu Movie ReviewDon't Miss47 Days Review - Tests your Patience LevelsBOTTOM LINE Tests your Patience Levels OUR RATING 1.25/5 Runtime 1hr 44mins What Is the...Vundavalli Aruna KumarDon't MissTime to Kill 'Undavalli' Factor?Veteran Political Leader, Vundavalli Aruna Kumar who never hesitates to proclaim himself as a well-wisher...Allu Arjun's Smuggling Spot ChosenDon't MissAllu Arjun's Smuggling Spot ChosenAllu Arjun's fans are eagerly awaiting to know how and where the makers of 'Pushpa'...Center Gives Cleanchit to Chandrababu NaiduDon't MissCenter Gives Cleanchit to ChandrababuUnion Jal Shakti Ministry has given a clean chit to the Chandrababu Naidu Government on...Actress Esha Gupta Cracking up Desires With Hot Yoga-Don't MissActress Cracking up Desires With Hot YogaThough it's a yoga pose that must be inspiring many regarding their health and fitness,...
Mirchi9