Tharun-Bhascker---Jr-NTRవిజయ్ దేవరకొండతో తెరకెక్కించిన “పెళ్లిచూపులు” సినిమాతో టాలీవుడ్ నాట పాపులర్ అయిన తరుణ్ భాస్కర్ త్వరలో “ఈ నగరానికి ఏమైంది?” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో “అరవింద సమేత” సినిమా షూటింగ్ లో బిజీగా తారక్ ను, ఈ సినిమా సెట్స్ లో తరుణ్ కలిసారు.

దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ కలయిక, తదుపరి సినిమాకు ప్లానింగా? లేక ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా ప్రమోషన్స్ కోసమా? అన్నది తేలాల్సి ఉంది. నవతరం దర్శకులతో పనిచేయడానికి టాలీవుడ్ అగ్ర హీరోలు ఏ మాత్రం వెనుకాడడం లేదన్న విషయం తెలిసిందే. దీంతో తరుణ్ – ఎన్టీఆర్ ల కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకున్నా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదన్నది టాలీవుడ్ టాక్.