Tammareddy-Bharadwaj open challangeఎవరికి బలిసింది సార్, ఎట్లా బలిసింది సార్, ఎక్కడ చూసారు సార్, ఎవరి బలుపు చూసారు సార్ మీరు, ఎవరి కులాన్ని గురించి మాట్లాడుతున్నారు. మీరు సామాజిక వర్గం గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను, తెలుగులో ఉన్న టాప్ 2 ప్రొడ్యూసర్స్ మీ సామాజిక వర్గం వారే.

మీ రాజకీయ నాయకులందరూ సిగ్గుపడాలి… ఎందుకంటే ఒక్క సినిమా ఇండస్ట్రీ మాత్రమే కులం, మతం లేకుండా పనిచేసే ఇండస్ట్రీ. మీది ఏ కులం అని అడిగి ఉద్యోగం ఇవ్వని ఇండస్ట్రీ ఇది ఒక్కటే. మీరు ఎక్కడైకెళ్లినా ఏదొక చోట కులం ప్రస్తావన ఉంటుంది, మాకు అప్లికేషనే ఉండదు అసలు.

ఇంకొక ఆయన ఎవరో ‘పుష్ప’ సినిమాలో రెడ్లను తిట్టారు, టైటిల్స్ చూస్తే నవీన్ యెర్నేని చౌదరి అన్నాడు, ఈయన చెప్పాడు కదా అని పొద్దున్నే టైటిల్స్ చూసా, నవీన్ యెర్నేని అనే ఉంది, ఈయన ఆయనకి చౌదరి కలిపి, ఆయనకు కులం ఆపాదించి, ఎందుకు కులాలు – మతాలు తీసుకొస్తారు ఇందులోకి.

ఎవర్ని మెప్పిద్దాం అనుకుంటున్నారు, ఎవర్ని తిడదాం అనుకుంటున్నారు, ఎవర్ని అవమానిద్దామనుకుంటున్నారు. అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తే మీరొచ్చారు, ఒక సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తే మీరు రాలేదు. సినిమా వాళ్లంటే చీప్ గా దొరికారని బలిసారు, సామాజిక వర్గం అంటున్నారు.

ఎంతెంత తింటున్నారు మీ ఎమ్మెల్యేలు, మీ చరిత్రలు ఏంటి? వాటిని గురించి మాట్లాడదామా? ఓపెన్ డిబేట్ కు వస్తారా ఎవరైనా? దమ్ముందా? ఎవరికి బలిసింది? ఎవరిని మెప్పించడానికి మీ బలుపులు, గిలుపులు, కులాలు – మతాలు గురించి మాట్లాడుతున్నారు?

ఎక్కడ నుండి వచ్చింది మీకందరికి సొమ్ము? మీరు రాజకీయాల్లోకి వచ్చినపుడు మీ సొమ్మెంత? మీ రాజకీయ నాయకుల ఆస్తులు తీయండి, మా సినిమా వాళ్ళ ఆస్తులు తీద్దాం. రండి… దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్! ఎవడాస్థి ఎంత ఉందో లెక్క తీద్దామా? ఎవరు ఎంత తింటున్నారో లెక్క తీద్దామా?

మేము కష్టపడి సినిమాను తయారు చేసి సంపాదిస్తున్నాం. ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాదు, 200 మంది కష్టపడితే వచ్చే ప్రాజెక్ట్ ఒక్క సినిమా. కోట్లకు కోట్లు పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నాం, అంతేగానీ మీ లాగా ఒక రూపాయి పెట్టేసి మొత్తం దోచుకు తినట్లేదు.

మేమెవ్వరం దేశాన్ని దోచుకు తినట్లేదు. మీరు ఎవరండి మమ్మల్ని బలుపు అనడానికి. మీ బలుపు సంగతి మీరు చూసుకోండి, మమ్మల్ని బలుపు అనే ముందు! పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని మీకు సవినీయంగా మనవి చేస్తున్నాను.

వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ‘బలుపు’ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ స్పందించిన విధానం ఇది. వైసీపీ నేతల మాటలను సినీ ఇండస్ట్రీ లైట్ గా తీసుకోవడం లేదు, సరైన సమయం కోసం వేచిచూస్తున్నారని చెప్పకనే చెప్తున్నాయి.