thalapathy vijayడిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు వ్యతిరేకంగా కోలీవుడ్ నిర్మాతల మండలి గత 16వ తేదీ నుంచి బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతలు షూటింగ్ లన్నీ నిలిపివేసి, డిజిటల్ ప్రొవైడర్లతో చర్చలు జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ బంద్‌ ను స్టార్ హీరో విజయ్ ఉల్లంఘించాడంటూ కోలీవుడ్ లో పెనుదుమారం రేగింది.