TG Venkatesh- Sujana Chowdary - CM Ramesh - Garikapati Mohan Raoఅధినేత చంద్రబాబు నాయుడు విదేశంలో ఉండగా తెలుగుదేశం పార్టీకు పెద్ద షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీను వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. తమను ఒక గ్రూప్‌గా పరిగణించాలంటూ ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారు. వీరంతా బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం.

టీడీపీ ఎన్డీయేని వీడిన నాటి నుండి సుజనా చౌదరిని అనేక కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోవడంతో ఇక పార్టీ మారడమే బెటర్ అనుకున్నారు నేతలంతా. పార్టీ మారే ఎంపీలు మూడింట రెండింతలు ఉండటంతో అనర్హత వేటు నుండి కూడానా తప్పించుకోబోతున్నారు. దీంతో రాజ్యసభలో టీడీపీ బలం రెండుకు పడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే మిగిలారు. వారి మీద కూడా పార్టీ మారాలని ఒత్తిడి ఉన్నట్టు సమాచారం.

ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు.. మంత్రి అమిత్ షా అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్డీయే నుండి బయటకు వచ్చి కేంద్రంపై తిరుగుబాటు చెయ్యడం… ఆ తరువాత యూపీఏకు మద్దతుగా చంద్రబాబు దేశమంతా కలియతిరగడంతో