New-Theater-Disclaimer-Comingదేశం మొత్తం కరోనా వైరస్ భయంతో ఊగిపోతోంది. ఇప్పటివరకూ తెలంగాణాలో ఇద్దరికి ఈ మహమ్మారి సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య ఇప్పటికి 28 వరకూ చేరింది. దీనితో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి.

చైనాలో పరిశ్రమలు మూతపడటంతో మందుల కొరత కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్‌లపైనే కాదు.. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్‌లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో మాల్స్‌ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. థియేటర్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తాను హోళీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని, గుంపులుగా ఉండే చోటు తిరగకుండా తీసుకున్న నిర్ణయమని చెప్పుకొచ్చారు. ఇది ప్రజల మీద బాగా ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. కాకపోతే ఈ నెలలో టాలీవుడ్ లో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. 25న విడుదలయ్యే నాని వీ వరకు పెద్ద సినిమాలు లేవు.

అప్పటి నుండి మే చివరి వరకూ వారానికో చెప్పుకోదగ్గ సినిమా వచ్చే అవకాశం ఉంది. ఆ లోగా పరిస్థితి అదుపులోకి వస్తే మంచిదే. వేసవి సీజన్ మీద టాలీవుడ్ చాలా నమ్మకం పెట్టుకుంది. కరోనా వల్ల సీజన్ ఎఫెక్ట్ అయితే మాత్రం పరిశ్రమకు అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. చూడాలి టాలీవుడ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో?