soaring heat killing manyప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి కాలు బయటకు పెడితే చాలు జనాన్ని కాల్చేస్తున్నాయి. ‘భానుడి’ ప్రతాపానికి గురై ఇప్పటికే ఏపీ, తెలంగాణాలలో పెద్ద సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఓ కీలక హెచ్చరిక జారీ చేసింది. బుధవారం నుండి నాలుగు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేసారు.

అత్యవసర పనులు ఉంటే తప్ప, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇల్లు వదిలి బయటకు రావద్దని సూచనలు జారీ చేసారు. ఒకవేళ బయటకు వచ్చినా, భానుడి వేడి నుంచి రక్షణ పొందే ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని, ఇందులో ఏమాత్రం అశ్రద్ధ వహించినా వడదెబ్బ (సన్ స్ట్రోక్) తగలడం ఖాయమని, అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగడం వలన స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని సంబంధిత అధికారులు ప్రజలకు హెచ్చరికలతో కూడిన సూచనలు చేసారు.