Telugu Tv actor Pradeep Suicide Latest newsతెలుగు బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపింది. హైదరాబాద్ లోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్ లోని అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. “సప్తమాత్రిక” సీరియల్ లో నటించిన ప్రదీప్ మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో సప్తపది, ఆరుగురు పతివ్రతలు వంటి పలు సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే ప్రదీప్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. దీనిపై ఎన్నో అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ రోజు తెల్ల‌వారు జామున అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్లు ప్రదీప్ భార్య పావ‌ని పోలీసులకు తెలియజేయగా, ప్ర‌దీప్ స్నేహితులు పోలీసుల‌కి తెలిపిన వివ‌రాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండడం విశేషం. అసలు మంగళవారం నాడు రాత్రి జరిగిన పార్టీలో ఉన్న‌ది పావ‌ని సోద‌రుడు కాద‌ని, అత‌డి స్నేహితుడేనని ప్ర‌దీప్‌ సన్నిహితులు చెబుతున్నారు. అతడి పేరు శ్రావణ్ అని, దుబాయ్ నుంచి ఆయ‌న‌ నాలుగు రోజుల క్రితం ఇక్క‌డ‌కు వ‌చ్చి, పావ‌ని, ప్ర‌దీప్‌ లు ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నాడ‌ని తెలిపారు.

ఈ క్ర‌మంలోనే శ్రావ‌ణ్ త‌న బ‌ర్త్ డే పార్టీని అర్ధ‌రాత్రి చేసుకున్నాడ‌ని చెప్పారు. శ్రావణ్‌ తో చనువుగా ఉన్నప్పుడు తీసుకున్న ఓ ఫోటోను పావని తన మొబైల్‌ లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంద‌ని, దీంతోనే ప్ర‌దీప్ పావ‌నితో గొడ‌వ ప‌డ్డాడ‌ని తెలిపారు. సూసైడ్ నోట్ కూడా రాయకుండా ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవ‌డం ఏంట‌ని అనుమానం వ్య‌క్తం చేస్తూ… శ్రావణ్ – పావని కలిసే ప్రదీప్‌ను హత్య చేసి ఉండొచ్చని అన్నారు. గొడవ కారణంగా ప్రదీప్ బాటిల్‌ తో త‌న తలపై గ‌ట్టిగా కొట్టుకున్నాడ‌ని, ఆ గాజు ముక్కలను పని మనిషితో పావని తీయించింద‌ని స్థానికులు అంటున్నారు.

అయితే ప్రదీప్ ఆత్మహత్య విషయంలో త‌న‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌లను శ్రావ‌ణ్ ఖండించాడు. పావ‌నికి త‌న‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని అంటున్నార‌ని, అన్నాచెల్లెళ్ల మ‌ధ్య కూడా ఇలాంటివి రావ‌డ‌మేంట‌ని వ్యాఖ్యానించాడు. తాను ఓ అన్న‌ స్థానంలో ఉండి పావ‌నికి పెళ్లి చేశాన‌ని, మా మ‌ధ్య అన్నాచెల్లెళ్ల సంబంధం మాత్ర‌మే ఉంద‌ని, వారి ఫ్యామిలీ మెంబ‌ర్‌ గా మారిపోయానని అన్నాడు. రెగ్యుల‌ర్ గా జ‌రిగే గొడ‌వ‌లాగే నిన్న కూడా గొడ‌వ జ‌రిగింద‌ని వ్యాఖ్యానించాడు.

ప్ర‌దీప్ కూడా త‌న‌తో చాలా క్లోజ్‌గా ఉండేవాడ‌ని, సినిమాల‌కు తాము క‌లిసే వెళ్లేవారిమ‌ని అన్నాడు. పావ‌ని త‌న‌తో తీసుకున్న ఫోటోను మొబైల్‌ లో ప్రొఫైల్ పిక్చ‌ర్‌గా పెట్టుకోవ‌డం వ‌ల్లే గొడ‌వ చెల‌రేగింద‌ని వ‌స్తోన్న వార్త‌ల‌ను ఖండిస్తూ… నిన్న రాత్రి కూడా ప్ర‌దీప్ త‌న‌తో మామూలుగానే మాట్లాడాడని, ఎప్పుడూ ఉన్న‌ట్లే త‌న‌తో ఉన్నాడ‌ని చెప్పాడు. దీంతో మిస్టరీగా మారిన ప్రదీప్ ఆత్మహత్య కేసులో నిజానిజాలను వెలికితీసే పనిలో పోలీసు వర్గాలు నిమగ్నమయ్యాయి.