Telangana Congress - YSR Congressరెండు తెలుగు రాష్ట్రాల్లోని రూలింగ్ పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లేకుండానే తమ చివరి బడ్జెట్ ను ప్రవేశపెట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిరాయింపులకు వ్యతిరేకం అంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల ముందు తన చివరి బడ్జెట్ ప్రవేశపెట్టేసింది.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో తొలి రోజే సస్పెన్షన్ల పర్వం నడిచింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి చేశారంటూ 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెషన్‌తో పాటు కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభా సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. సస్పెండ్ ఐన వారిలో ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో సహా సభలో మిగిలి ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరిని సస్పెండ్ చేశారు.

దీనితో సభలో కాంగ్రెస్ సభ్యులే లేకుండా పోయారు. రెండు అసెంబ్లీల లోను బీజేపీ ఎమ్మెల్యేలే మిగిలారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ టీడీపీ మిత్రపక్షమైన తాజాగా రాజకీయ సంఘటనలతో వారు దాదాపుగా ప్రతిపక్షమై పోయారు. తెలంగాణాలో బీజేపీ మొదటినుండీ తెరాసకు ప్రతిపక్షమైనా ఇప్పటిదాకా సమర్ధవంతంగా ఆ పాత్రను పోషించారు లేదు. ఇప్పుడేం చేస్తారో చూడాలి మరి.