“తెలుగు ఒరిజినల్‌ కంటెంట్‌ తో దూసుకెళ్తున్న ZEE5”

“ZEE5 Announces Four Telugu Originals Across Genres”హైదరాబాద్, జనవరి 12, 2020: భారతీయ భాషలలో ఒరిజినల్‌ కంటెంట్‌ క్రియేట్‌ చేయడం లో భారత దేశం లోనే అగ్రస్థానాన్ని పొందిన ZEE 5 ఈ సంక్రాంతికి నాలుగు ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ ని నాలుగు విభిన్న జానర్స్‌ లో ప్రేక్షకులకు అందించబోతున్నట్టు సగర్వంగా ప్రకటిస్తోంది. తద్వారా తెలుగు కంటెంట్‌ ని భారతీయ ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తోంది.

ZEE 5, ఇండియా (ZEE5 India) పోగ్రామింగ్‌ హెడ్‌ అపర్ణ అచరేకర్‌ (Aparna Acharekar) మాట్లాడుతూ, గతం లో మాకు తెలుగు ప్రేక్షకుల నుంచీ అద్భుతమైన ఆదరణ భించింది. అందుకే ఈ సంక్రాంతి సందర్భంగా 2020 మొదటి ఆరునెలలలో మేం అందించ బోయే వెబ్‌సిరీస్‌ వివరాలని ప్రేక్షకులకి సగర్వంగా తెలియచేస్తున్నాం అన్నారు. ప్రతిభ వున్న రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచీ వస్తున్న మా వెబ్‌సిరీస్‌ (Telugu Originals) ప్ర్రేక్షకులని తప్పక రంజింప చేస్తుందని అనుకుంటున్నాం అని తెలియజేసారు.

G.O.D, High Priestes, కైలాసపురం (Kailasapuram), మిసెస్ సుబ్బలక్ష్మి (Mrs. Subbalakshmi), NERD, Hawala, B.Ttech, ఎక్కడికి ఈ పరుగు (Ekkadiki E Parugu), వాట్స్ యాప్ పనిమనిషి (What’s Up Panimanishi), చిత్ర విచిత్రం (Chitra Vichitram), నాన్న కూచి (Nanna Koochi) వంటి విజయవంతమైన వెబ్‌సిరీస్‌ ని అందించిన ZEE 5 ఇప్పుడు 2020 లో కూడా ప్రేక్షకులను కనువిందు చేయనుంది.

చదరంగం (Chadarangam) రాజకీయ నాయకుడిగా మారిన ఒక నటుడి గురించిన కధ ఇది. ఈ కధలో ఎత్తుకు పై ఎత్తు, అత్యాశ అనేది ఎలాంటి పనులని చేయిస్తుంది వంటి ఆసక్తికర అంశాలని మన ముందు వుంచే ఈ వెబ్‌సిరీస్‌ ఒక లోతైన పొలిటికల్‌ డ్రామా. 24 ఫ్రేమ్స్‌ ఫాక్టరీ బ్యానర్‌ పై విష్ణు మంచు నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ ని రాజ్‌ అనంతానంద్‌ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్‌, సునయన, నాగినీడు తదితరులు నటించారు. ZEE 5 లో ఫిబ్రవరి 20 వ తారీఖున ప్రీమియర్‌ ప్రసారం కానుంది.

LOSER ఇది ఒక స్పోర్ట్స్‌ డ్రామా. మూడు కథలని వేర్వేరు కాలమానాల్లో చూపించడం జరుగుతుంది. ఒక ఔత్సాహిక క్రికెటర్‌, బాడ్మింటన్‌ ప్లేయర్‌, రైఫిల్‌ షూటర్‌, వారు తమ ఆశయాలని సాధించేందుకు పడిన కష్టాలకి సంబంధించిన కధ కధనాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. అన్నపూర్ణ స్టుడియోస్‌ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, షాయాజీ షిండే, శశాంక్‌, తదితరులు నటించిన ఈ వెబ్‌సిరీస్‌ మార్చ్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Expiry Date తెలుగు, హిందీ లలో వస్తున్న ఈ క్రైమ్‌ థ్ల్రిల్లర్‌ లో ప్రేమకి ప్రతిరూపమైన ఒక భర్త, తను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యనే, తనని మోసం చేసినందుకు గాను చంపేస్తాడు. శరత్‌ మరార్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై నిర్మించిన ఈ సిరీస్‌ కి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించాడు. స్నేహ ఉల్లాల్‌, మధుషాలిని, అలీ రెజా తదితరులు నటించిన ఈ సిరీస్‌ జూన్‌ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అమృతం ద్వితీయం (Amrutham Dvitheeyam) 2001 నుంచీ 2007 వరకూ విజయవంతంగా ప్రదర్శించబడిన అమృతం సీరియల్‌ కి ఇది సీక్వెల్‌. హర్షవర్ధన్‌, శివనారాయణ, వాసు ఇంటూరి, ఎల్బీశ్రీరాం, సత్య క్రిష్ణ తదితరులు నటిస్తున్న ఈ సిరీస్‌ నెలకి రెండు సార్లు ప్రసారం కానుంది. గంగరాజు గుణ్ణం రచించగా, సందీప్‌ గుణ్ణం దర్శకత్వం వహించి, ఇద్దరూ కల్సి లైట్‌బాక్స్‌ మీడియా బ్యానర్‌ పై నిర్మించిన ఈ సిరీస్‌ ఉగాది రోజు మార్చి 25 న ప్రసారం కానుంది.

ZEE 5 కి డౌన్‌లోడ్ చేసి, సభ్యత్వాన్ని పొందండి లేదా లాగిన్ అవ్వండి www.zee5.com

Press release by: Indian Clicks, LLC

Follow @mirchi9 for more User Comments
CBI-Court-Serious-on-CM--YS-JaganDon't Missకోర్టులో జగన్ కు మళ్ళీ చుక్కెదురుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు కోర్టులో చుక్కెదురయ్యింది....Pawan-Kalyan - YS-Jagan-Don't MissYSR Congress Not To Spare Pawan Kalyan Despite Being A Partner of BJP?Ruling YSR Congress Party seems to be trying to fire salvos on Janasena President Pawan...Prabhas' Screen Mother Bhagyashree Calls It Heaven on EarthDon't MissPrabhas' Mother Calls It Heaven on Earth1989 & 90 were the years when Bhagyashree's name was on everyone's tongue as the...Disco Raja Movie Review -Don't MissDisco Raja Review -Sci-Fi Coated Routine Revenge DramaBOTTOM LINE Sci-Fi Coated Routine Revenge Drama OUR RATING 2.25/5 CENSOR UA - 2 hrs...High Court Directs Government Not To Shift Offices to VishakapatnamDon't MissHigh Court Directs Government Not To Shift Offices to VishakapatnamIn what can be termed as another jolt to YS Jagan Mohan Reddy Government, Andhra...
Mirchi9