Facebook movie hero uday kiran in mental hospital‘ఫేస్ బుక్’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనా హీరో ఉదయ్ కిరణ్ ను ప్రస్తుతం ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉదయ్ కిరణ్ తన సహచర ఖైదీలు, జైలు సిబ్బందిపై విరుచుకుపడడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, వైద్యుల సలహా మేరకు ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రానికి తరలించారు. దాదాపు 15 రోజుల పాటు ఇక్కడే ఉదయ్ కిరణ్ కు చికిత్స అందించనున్నారు.

తనను పబ్ లోకి అనుమతించడం లేదన్న కారణంతో ‘ఓవర్ ది మూన్’ పబ్ అద్దాలు పగలకొట్టి, కుర్చీలు విసిరి నానా రాద్ధాంతం చేసిన ఉదయ్ కిరణ్, ఆ తర్వాత పబ్ లోకి చొరబడి, నగ్నంగా డ్యాన్స్ లు చేసాడని అప్పట్లో అభియోగాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే జుబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా, జైల్లో విచారణలో కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని బుధవారం నాడు కోర్టులో హాజరు పరచిన సమయంలో పోలీసులు జడ్జికి విన్నవించారు. దీంతో మానసిక వైద్య నిపుణుల సలహాలను పాటించి, చికిత్స అందించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.