Telugu film industry people will meet YS Jagan తెలుగు చిత్ర పరిశ్రమ అతి త్వరలో థియేట్రికల్ వ్యాపారాన్ని పునః ప్రారంభించబోతోంది. కోవిడ్ రెండవ వేవ్ తరువాత సత్యదేవ్ యొక్క తిమ్మరుసు మొదటి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం జూలై 30 న విడుదల కానుందని ఇప్పటికే అధికారికం ప్రకటించారు.

మరోవైపు… తేజ సజ్జా యొక్క ఇష్క్ కూడా ఈ నెలలోనే విడుదల కానుంది. ఇక పోతే వచ్చే సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనుంది.

థియేటర్లను తిరిగి ప్రారంభించే ముందు ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్ల గురించి వారు ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. వకీల్ సాబ్ సమయంలో ప్రభుత్వం ఎప్పుడో 2011లో తీసుకొచ్చిన ఒక జీవో ని బయటకు తెచ్చి సినిమాను ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.

సీఎం తో చర్చించి అన్ని వర్గాలకు అనుకూలమైన రేట్లు ప్రకటింపజేసుకుని … సినిమా రిలీజ్ డేట్లు ప్రకటించుకోవాలని సినిమా పెద్దలు ఆలోచన చేస్తున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే… ఆగస్టు పెద్ద సినిమాల నెల కానుంది.

నాగ చైతన్య లవ్ స్టోరీ ఆగస్టు మొదటి వారంలో బాక్సాఫీస్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. నాని టక్ జగదీష్, విక్టరీ వెంకటేష్ నారప్ప కూడా అదే నెలలో విడుదల కానున్నాయి. అంటే ఆగస్టులో నలుగు వారాలలో కనీసం మూడు వారాల పాటు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ ను ఆక్రమిస్తాయి. ఆంధ్రలో 100% అక్కుపెన్సీ కి పర్మిషన్ ఇవ్వకపోయినా ఈ సినిమాలు విడుదలకే మొగ్గు చూపుతున్నాయని సమాచారం.