telugu film industry in loss due to coronavirus effectకరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతుంది. భారత్ లో ఇప్పటికే 110 కేసులు నమోదు అయ్యాయి. ఈ కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అత్యధికంగా నష్టపోయే రంగంగా అవతరిస్తుంది. వుహాన్ లో జన్మించిన వైరస్ యొక్క వ్యాప్తిని నివారించడానికి దేశంలోని పలు రాష్ట్రాలు సినిమా థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని థియేటర్లను కూడా మూసివేసింది. ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ఫిల్మ్ థియేటర్లను తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఫిల్మ్ ఎగ్జిబిటర్లకు నెలకు 5,800-7,800 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇందులో 3,500 – 4,500 కోట్లు సినిమా టిక్కెట్ల అమ్మకానికి, జిఎస్‌టి 800 – 1,000 కోట్ల నష్టంతో సహా.

అదే విధంగా థియేటర్లలో ఆహారం మరియు పానీయాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ. 1,500 – 1,800 మరియు అదనంగా 900 – 1,000 కోట్లు ప్రకటనల ఆదాయంలో నష్టపోతాయి. ఇప్పటికి సినిమా థియేటర్లు పదిహేను రోజులకు పైగా మూసి వెయ్యబడతాయని అర్ధం అవుతుంది.

ఆ తరువాత పరిస్థితి ఏంటి అనేది అర్ధం కాకుండానే ఉంది. ఈ పరిస్థితి నెల.. నెలన్నర పాటు సాగితే ఇండస్ట్రీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. వేసవి సెలవులను నమ్ముకుని రిలీజ్ ప్లాన్ చేసుకున్న అనేక సినిమాలు వాయిదా పడాల్సి వస్తుంది. వేసవి సెలవులు కోల్పోతే మళ్ళీ దసరా వరకు సరైన సీజన్ ఉండదు.