TDP Campaining Reddy Rajyamఅధికార పక్షంలో ఉన్న పార్టీని విమర్శించి తద్వారా ప్రజల దృష్టిని తమ వైపుకు తిప్పుకోవడం అనేది ప్రతిపక్ష పార్టీల విధి. అయితే ఈ విమర్శలను నిర్మాణాత్మకంగా చేయడంలోనే ఆయా పార్టీల సిద్ధాంతాలు తెలుస్తుంటాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూడా అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

టిడిపిని ఓ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేసేలా ‘వైసీపీ అండ్ కో’ చేస్తోన్న ప్రచారాన్ని బలంగా చేస్తున్న వైనం తెలియనిది కాదు. అయితే ఇందులో ఉన్న వాస్తవాలేమిటో నిర్మాణాత్మకంగా గణాంకాలతో సహా టిడిపి వర్గాలు సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు.

అందులో భాగంగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రెడ్డి’ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఎవరికెన్ని పదవులు కట్టపెట్టారో అన్న విషయాన్ని నామినేటెడ్ పదవుల నుండి ప్రైవేట్ యూనివర్సిటీ ప్రతిపాదన కమిటీ వరకు లెక్క కట్టి మరీ సోషల్ మీడియాకు ఎక్కించారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని అత్యంత కీలక పదవులను రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టిన వైనం వైరల్ అవుతోంది. మరి దీనిని ఇంకెంత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారో గానీ, ‘జగన్ రెడ్డి ఏలుబడిలో రాజ్యాధికారం’ మాత్రం చక్కర్లు కొడుతోంది.