Telugu Awards - Baahubali Arjun Reddy Jai lava Kusaఈ ఏడాది టాలీవుడ్ కళకళలాడుతోంది. దసరాకు విడుదలైన పెద్ద సినిమాలు నిరుత్సాహపరిచిన సంగతి పక్కన పెడితే, ఈ ఏడాది సక్సెస్ రేటు ఎక్కువన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొత్తదనంతో కూడిన కధలను నెత్తిన పెట్టుకోవడంలో తెలుగు ప్రేక్షకులు మక్కువ చూపడం గమనించదగ్గ పరిణామం. బాక్సాఫీస్ సక్సెస్ తో పాటు చిన్న, పెద్ద హీరోలు కూడా అద్భుతమైన అభినయం కనపరుస్తూ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కు అందని ద్రాక్ష పండులా మారిన “నేషనల్ అవార్డ్” అనేది 2017వ సంవత్సరంలో టాలీవుడ్ కు రాసి పెట్టి ఉందన్న విషయం “బాహుబలి 2” విడుదల తర్వాత ఖరారైంది.

సిల్వర్ స్క్రీన్ పై ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ అభినయరూపంతో, ఈ ఏడాది ‘ఉత్తమ హీరో’ ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ పేరు కూడా బాగా వినిపించింది గానీ, ప్రభాస్ కు పోటీనిచ్చే రేంజ్ లో అయితే ఉండకపోవచ్చు. ఇదిలా ఉంటే… సినిమా విడుదలకు ముందే “జై లవకుశ” చిత్రంలో ‘యంగ్ టైగర్’ కనపరిచిన అభినయానికి ఖచ్చితంగా ‘నేషనల్ అవార్డ్’ నడుచుకుంటూ వస్తుందని కళ్యాణ్ రామ్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం… విడుదలైన తర్వాత సినీ విమర్శకులు కూడా ‘జై’ పాత్రకు పట్టం కట్టడంతో… బరిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారన్న విషయం ఖరారైంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ‘ఉత్తమ హీరో’ జాబితాలో లేకపోవడం తెలుగు సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే అసలు విషయం.

అవును… ‘జై’ అనే నెగటివ్ క్యారెక్టర్ లో రావణాసురుడుగా జూనియర్ ఎన్టీఆర్ వెండితెరపై చెలరేగిపోవడంతో… “ఉత్తమ విలన్”గా తారక్ కు కూడా మరో నేషనల్ అవార్డ్ వస్తుందా? అనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ అంశంలో కూడా “బాహుబలి 2” సినిమాలో ‘భళ్ళాలదేవుడు’ పాత్ర ద్వారా రానా నుండి తీవ్ర పోటీ ఎదురుకావడం తధ్యం. ఏది ఏమైనా మళ్ళీ తెలుగుకే తధ్యం గనుక, ఈ ఏడాది జాతీయ స్థాయిలో తెలుగు హీరోల పేర్లు మారుమ్రోగడం ఖాయం అన్న మాట. కలెక్షన్ల పరంగానే కాక, అభినయం ప్రదర్శించడంలోనూ తెలుగు హీరోల దూకుడు బహుశా బాలీవుడ్ కు మింగుడు పడకపోవచ్చు గానీ, తెలుగు సినీ ప్రేక్షకులకు మాత్రం కన్నులవిందులా మారుతోంది.