Telugu actor Prince recommends young girls for bigg boss showతెలుగు నాట మొదటిసారిగా ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ షో ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో చూస్తున్నారేమో గానీ, అందులో ఎంపిక చేసిన సెలబ్రిటీలపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కుర్ర భామలను ఎంపిక చేసి, హాట్ హాట్ సన్నివేశాలకు బాలీవుడ్ ‘బిగ్ బాస్’ కేరాఫ్ అడ్రస్ గా నిలువగా, తెలుగు నాట మాత్రం ఇందుకు అవకాశం లేకుండా అవుట్ డేటెడ్ నటీమణులను ఎంపిక చేసారు. దీంతో చూసే ప్రేక్షకులే కాదు, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హీరో ప్రిన్స్ వంటి వారు కూడా చాలా నిరుత్సాహం చెందినట్లుగా స్పష్టమైంది.

తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో ఈ దిశగా ‘బిగ్ బాస్’కు ఓ విజ్ఞప్తి చేసాడు ప్రిన్స్. ఇక్కడ అందరూ ఆంటీలే ఉన్నారు, తన వయసుకు సంబంధించి ఒక్క అమ్మాయి కూడా లేదు. ఉదయం పూట జిమ్ చేయాలన్నా ఉత్సాహం రావట్లేదు, అదే పక్కన అమ్మాయిలు ఉంటే వారు చూస్తున్నారున్న ఉత్సాహంతో మరిన్ని ఎక్సర్సైజులు చేస్తాం… ప్లీజ్ ఎవరైనా మంచి అమ్మాయిని పంపించండి… పేర్లు చెప్పమంటే తాను చెప్తాను… వద్దులేండి… మీరే పంపించండి బిగ్ బాస్… అంటూ తన విన్నపాన్ని సీసీ కెమెరా సాక్షిగా వేడుకున్నాడు.

మరి ‘బిగ్ బాస్’ హీరో ప్రిన్స్ విజ్ఞప్తిని పట్టించుకుంటారో లేదో గానీ, ఇప్పటివరకు సాగిన రెండు రోజుల కార్యక్రమం చాలా చప్పగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది. రొటీన్ తెలుగు మెలో డ్రామా మాదిరి కొనసాగుతుండడంతో, ఇదే విధానం మున్ముందు కొనసాగితే, నిర్వాహకులు ఆశించిన విధంగా విశేషమైన ప్రజాదరణను చూరగొనడం కష్టమైన విషయమే అని చెప్పడంలో సందేహం లేదు. 14 మందిలో కనీసం ఒకరిద్దరూ కూడా క్రేజీ ఆర్టిస్టులు లేకపోవడం ప్రధాన మైనస్.