Television Serials shooting started in ramoji film cityతెలంగాణ ప్రభుత్వం ఇటీవలే షూటింగులకు అనుమతి జారీ చేసింది. అయితే నిబంధనలు కఠినంగా ఉండటంతో ఇప్పటివరకూ ఏ సినీ బృందం కూడా షూటింగ్ మొదలుపెట్టలేదు. అయితే శుక్రవారం సైలెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక టీవీ సీరియల్ షూటింగ్ ప్రారంభించింది. పూర్తి కరోనా జాగ్రత్తల మధ్య షూటింగ్ పూర్తి చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సీరియల్ శుక్రవారం షూటింగ్ మొదలుపెట్టింది. లొకేషన్ లోకి వచ్చే సిబ్బంది ఒక డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ నుండి నడిచి వెళ్ళాలి.. మాస్కులు, శానిటైజర్లు, మాస్కులు, గ్లోవ్స్ తప్పకుండా వాడాలి. అంతకు ముందే లొకేషన్, షూటింగ్ కు వాడే పరికరాలు పూర్తిగా శానిటైజ్ చేసి ఉంచారు.

నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ఇతర సిబ్బందికీ థర్మల్ స్క్రీనింగ్ చేసే అనుమతించారు. మేక్ అప్ సిబ్బంది పీపీఈ సూట్లు ధరించే మేక్ అప్ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో సోషల్ డిస్టెంసింగ్ పాటించి భోజనం చేశారు. మొత్తంగా కేవలం 20-30 మంది తోనే రోజంతా షూటింగ్ జరిపారు. లాక్ డౌన్ సమయంలో ఈ సీరియల్ ప్రసారం నిలిపివేశారు. తొందరలో తిరిగి మొదలుపెట్టబోతున్నారు.

మొత్తానికి ఈ చిన్న సీరియల్… టాలీవుడ్ లోని ఎన్నో పెద్ద సినిమాలకు ధైర్యం కలిగిస్తుంది. అయితే సినిమాల చిత్రీకరణ… సీరియల్ షూటింగ్ అంత తేలికగా ఉండదు. కాబట్టి మునుముందు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఏ ఒక్క చిత్రబృందం షూటింగ్ మొదలుపెట్టనున్నటు ప్రకటించలేదు.