Ego-Vs-Safegame-What-Will-Be-KCR's-Choiceఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 8న తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ నెల 7తో శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమా వళి ముగియనుండగా, ఆ తర్వాత ఏ క్షణం లోనైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయం గురించి కేసీఆర్ గవర్నర్ కు సూచనప్రాయంగా తెలిపారట.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో కేసీఆర్‌తో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. కొత్తగా మరో ఆరుగురికి అవకాశం దక్కనుంది. అందులో ఇద్దరు మహిళలకు ఈసారి కేబినెట్‌లో చోటు కల్పిస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్‌లో ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ కంచుకోటలాంటి కరీంనగర్‌లో బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వారి ఓటమికి బాధ్యులను చేస్తూ ఎవరైనా మంత్రుల మీద వేటు వేస్తారా?

ఫలితాల పట్ల గుర్రుగా ఉన్న సీఎం ముగ్గురు మంత్రులను తప్పించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గత విస్తరణ సందర్భంగా పక్కన పెట్టిన హరీష్ రావు, కేటీఆర్ లను ఈ సారి కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. హరీష్ ను పక్కన పెట్టడం కూడా లోక్ సభ ఎన్నికలలో ఓడిపోవడం అని పార్టీలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కవితను ఉప ఎన్నికల బరిలో దించి ఆమెను రాష్ట్రంలో మంత్రిని చేస్తారనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో ఉంది.