Will Pawan Kalyan Risk Contesting in Telangana?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తూర్పు గోదావరి జిల్లా నాయకులతో సమావేశం అవుతున్నారు. కొన్ని చేరికలు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుండి మొదటి అభ్యర్థిని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ముమిడివరం నియోజకవర్గం నుండి పితాని బాలకృష్ణను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.

ఇదంతా బానే ఉంది గానీ గత రెండు రోజులుగా విరివిగా సమావేశాల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల గురించి మాత్రం మాట్లాడటం లేదు. వచ్చే ఎన్నికలలో పార్టీ పోటీ చేస్తుందో లేదో కూడా ఇప్పటిదాకా స్పష్టం చెయ్యలేదు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశాక పవన్ కళ్యాణ్ దానిపై కనీసం స్పందించలేదు.

అసెంబ్లీ రద్దయ్యాకా రెండు రోజులు సమావేశాలు, పొత్తులు అంటూ హడావిడి చేసారు. మళ్ళీ దానిపై అలికిడి లేదు. ఆంధ్ర వాసులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే అటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఉపయోగపడే అవకాశం ఉండొచ్చు.