Telangana CM KCR against BJP Congressఇటీవలే అసెంబ్లీ నుండి బహిష్కరింపబడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. వారిపై విధించిన అసెంబ్లీ బహిష్కరణ ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీచేసింది.

అయితే వారిని ఉపేక్షించరాదని ప్రభుత్వం అభిప్రాయపడుతుందట. స్పీకరుకు ఉన్న విశేషాధికారాలతో అసెంబ్లీలో జరిగినవాటిని కోర్టు పరిధిలోకి రావని చెప్పి హైకోర్టు తీర్పు ధిక్కరించాలని యోచిస్తుందట. గతంలో ఫిరాయింపుల కేసులో కూడా కోర్టుకు స్పీకర్ సహకరించని విషయం తెలిసిందే.

అయితే వారి శాసనసభ్యత్వాలు రద్దయితే ఎన్నికలు నిర్వహించాల్సింది కేంద్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించినా దానికి ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తాదో చూడాలి. అటువంటి సందర్భంలో రాజ్యాంగ సంక్షభం వచ్చే అవకాశంకూడా ఉండటంతో ప్రభుత్వం ఆచితూచి అడుగేయాల్సి రావొచ్చు.