telangana takes advantage on andhra pradesh election code on alcoholఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మద్యపాన నిషేధం అంటుంటే తెలంగాణలో మాత్రం అక్కడి ప్రభుత్వం మద్యం ఏరులై పారిస్తుంది. గడచిన సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల నుండి 12,000 కోట్లు సంపాదించింది. ఈ ఏడాది బడ్జెట్ లో ఆ టార్గెట్ ని మరింత పెంచింది.

వచ్చే ఏడాదికి గాను మద్యం అమ్మకాల నుండి 16,000 కోట్ల ఆదాయం టార్గెట్ గా పెట్టుకుంది. సొంత రాష్ట్రంలో అమ్మకాలు పెంచడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దులో గల మద్యం దుకాణాలలో కూడా భారీ ఎత్తున అమ్మకాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దులో గల తెలంగాణ మద్యం దుకాణాలలో డిమాండ్ బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటం, ప్రధాన బ్రాండ్లు దొరకకపోవడం, ప్రభుత్వం నిర్వహించే దుకాణాలు రాత్రి 8 గంటల తరువాత మూసివెయ్యడం వంటి వాటితో తెలంగాణ మద్యం దుకాణాలకు మందుబాబులు బారులు కడుతున్నారు.

మరోవైపు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కొత్త దుకాణాల లైసెన్సులు ఇస్తూ పోతుంది. మెయిన్ రోడ్లలోనే కాకుండా గల్లీలలో కూడా మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఈ అన్ని మార్గాల ద్వారా గతంలో కంటే 4,000 కోట్లు ఎక్కువ ఆదాయం రాబట్టేలా టార్గెట్ గా పెట్టుకుంది ప్రభుత్వం.