Telangana-To-Shut-Down,-Announces-Relief-to-the-Poorకరోనావైరస్ ముప్పును ఎదుర్కోవడానికి మార్చి 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో, ఇంటి నుండి ఎవరూ బయటకు రాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నిత్యావసరాల కొనుగోలు కోసం ఒక కుటుంబానికి ఒక వ్యక్తి మాత్రమే బయటకు వెళ్ళడానికి అనుమతించబడతారు.

బలహీన వర్గాల సంరక్షణ కోసం, ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం, 87.5 లక్షల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కిరాణా సరుకుల కొనుగోలుకు 1500 రూపాయల నగదును ఇస్తుంది. దీని నుండి 2.83 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది, మరియు దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 2417 కోట్ల వ్యయం చేస్తుంది.

ఈ తొమ్మిది రోజులలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్ సర్వీసెస్, క్యాబ్‌లు, ఆటోలతో సహా మొత్తం ప్రజా రవాణా మూసివేయబడుతుంది. పక్క రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులు పూర్తిగా మూసివెయ్యబడతాయి. అవసరమైన వస్తువులను తీసుకొచ్చే వాహనాలు మాత్రమే అనుమతించబడతాయి.

అన్ని మద్యం షాపులు, పబ్బులు, బార్‌లు కూడా మూసివేయబడతాయి. ఇది ఇలా ఉండగా తెలంగాణాలో ఈరోజు ఐదు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 350కు చేరాయి.