Telangana Projects expenditureరానున్న మూడు నాలుగేళ్లలో సాగునీటి ప్రోజెక్టుల పేరు చెప్పి తెలంగాణ భారీగా ఖర్చు పెట్టబోతోంది. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే కనీసం మరో లక్షా యాభై వేల కోట్లు అవసరమని అంచనా. ఇప్పటికే చేపట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో చేసిన వ్యయం పోనూ తాజా అంచనాల ప్రకారమే ఈ మేరకు నిధులు అవసరం.

నిర్మాణంలో జాప్యం..పనుల్లో మార్పులు, భూసేకరణ, పునరావాసానికి పెరిగే వ్యయం ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఇంకా వ్యయం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం 84000 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే ఈ ప్రాజెక్టులన్నీ మూడు,నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం.

దీనికి ఏడాదికి కనీసం 40000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇందులో చాలా వరకు విద్యుత్ ఆధారిత ప్రాజెక్టులు కావడంతో వీటి నిర్వహణ భారం కూడా ఎక్కువగా ఉండబోతుంది. అయితే కాళేశ్వరంతో సహా కొన్ని ప్రాజెక్టుల పనులు వేగంగా జరగుతుండగా, పాలమూరు-రంగారెడ్డితో సహా మరికొన్నింటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒప్పందం గడువులోగా సగం పనులు కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.