Telangana Ministers attended Badrachalam Sriramanavami celebrationsప్రతి ఏడాది వేల మంది సమక్షంలో జరిగే భద్రాద్రి రాముడి కల్యాణోత్సవం ఈసారి లాక్ డౌన్ ప్రభావంతో భక్తులకు ప్రవేశం లేకుండా కోవెల ప్రాంగణంలో నిరాడంబరంగా ఈ వేడుకను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆలయ అర్చకులకు అందజేశారు.

అయితే హాజరయ్యింది నలభై మందే అయినా ఏ మాత్రం సోషల్ డిస్టెంసింగ్ అనేది పాటించకుండా గుమ్మి కూడి ఉత్సవంలో పాల్గొనడంతో లక్ష్యం నెరవేరలేదు అనే చెప్పుకోవాలి. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అమాత్యులు కూడా నిబంధనలను పాటించకపోవడం దారుణం అనే చెప్పుకోవాలి.

అసలు ఈ వేడుకను కేవలం పురోహితులతోనే నిర్వహించుకుంటే పోయేది అని సామాన్యులు అనుకునేలా చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరుపునుండి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ కావడంతో మంత్రులను పంపారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఇది ఇలా ఉండగా ఈ వేడుకను టీవీలో లైవ్ టెలికాస్ట్ చెయ్యడంతో భక్తులు తమ టీవీలలోనే చూసుకుని ఆనందపడ్డారు. ఇది ఇలా ఉండగా…. తెలంగాణ లో ఈ రోజు ఉదయం నాటికి కరోనా కేసులు 132కు చేరాయి. ఢిల్లీలోని ఒక ముస్లిం ఈవెంట్ కు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.