Telangana ministers at Megha Engineering and Infrastructure Limited houseఇటీవలే పోలవరం రివర్స్ టెండరింగ్ లో అత్యల్ప టెండర్ వేసిన మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు చేప్పట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. 18 సెంట్రల్‌, 78 స్టేట్‌ ఆఫిసర్లు, నాలుగు సీఆర్ఫీఎఫ్ ప్లాటూన్లు వచ్చాయి.

నేడు ఈడీ కూడా రంగంలోకి దిగుతుందనే వార్తలు వస్తున్నాయి. మేఘకు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల రాష్ట్రానికి చెందిన అధికారులను గానీ పోలీసులను గానీ పూర్తిగా దూరం పెట్టారు. ఇది ఇలా ఉండగా వెలుగు పత్రిక ప్రచురించిన ఒక వార్త ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. ఈ దాడులకు తెలంగాణ ప్రభుత్వం భయపడుతోందని సూచిస్తుంది.

వివరాల్లోకి వెళ్తే… ఉమ్మడి మహబూబ్ నగర్ లో చెందిన ఒక మంత్రి నిన్న మేఘ కృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉన్న వేరే ఇంట్లో మకాం వేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారట. అలాగే ఉమ్మడి వరంగల్ కు చెందిన ఒక మంత్రి కాన్వాయ్ కూడా చాలా సార్లు ఆ ఇంటి వద్దే చక్కర్లు కొట్టిందట. లోపలకు వెళ్లే అవకాశం లేదని వెనుతిరిగారట.

మరోవైపు ఇంటలిజెన్స్ బ్యూరో, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా మఫ్టీలో మేఘ కృష్ణారెడ్డి ఇళ్ళు, ఆఫీసుల వద్ద సంచరిస్తూ కనపడ్డారట. లోపల ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేసే ప్రయత్నం చేసారని ఆరోపణ. మొత్తానికి మేఘా మీద ఐటీ దాడులు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందా?