Singireddy-Niranjan-Reddy_YS Sharmilaవైఎస్ఆర్ ఫ్యామిలీ కి పాద యాత్ర సెంటిమెంట్ ఉంది. దివంగత రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి యాత్ర చేసి మెజారిటీ ఓట్లు సాధించి ముఖ్యమంత్రి పీటం ఎక్కారు. తాజాగా ఆ ఫ్యామిలీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల కూడా తెలంగాణలో పాద యాత్ర మొదలు పెట్టింది.

ఆ యాత్ర లో భాగంగా నిరుద్యోగుల కోసం ఆమె దీక్ష చెప్పట్టింది. దీని పై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్తలు చేశారు. ‘ నిరుద్యోగుల ఉద్యోగాల కోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని లేదంటే భారీ స్థాయిలో దీక్ష చేస్తానని మంగళవారం మరదలు ఒకామె బయలుదేరింది’ అంటూ కామెంట్ చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆమె డిమాండ్ వెనుక పెద్ద ఎత్తుగడ ఉందని ఆయన అన్నారు. ఆ డిమాండ్ తో 20 శాతం కోటాలో తెలంగాణా ఉద్యోగాలను పొందేందుకు ఆమె కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఒక రాజకీయ నాయకురాలిని మరదలు అంటూ సంభోదించడం కరెక్ట్ కాదని, మంత్రి గారికి కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు షర్మిల పార్టీ నాయకులు. ఇక టి ఆర్ ఎస్ పార్టీ మంత్రి కి అక్క చెల్లెలు లేరా ? ఒక మహిళ ను పట్టుకుని ఇలా మాట్లాడతారా ? ఈ కుక్కలను తరిమికొట్టే రోజు తొందర్లోన ఉంది అంటూ షర్మిల స్పందించారు.