telangana-kcr-notes-ban-state-lossపెద్ద నోట్ల రద్దుపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ… ఈ నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన లోటును కేంద్ర ప్రభుత్వమే భరించాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కంటే కింద స్థాయిలో పని చేస్తాయి కాబట్టి చిన్న స్థాయి వారు పెద్ద స్థాయి వారిని అడగడంలో తప్పు లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కుడా ఒకటి గమనించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉండే చిన్న, పెద్ద వ్యాపారస్తులు ఎవరికీ తగ్గ స్థాయిలో వారు వారి వ్యాపారాలలో నష్టాలను, లోటును భరించారు. మరి వారి పరిస్థితి గురించి ఎవరు ఆలోచిస్తారు?

పెళ్ళిళ్ళు వంటి ప్రధాన వేడుకల మొదలు – చిన్న చితక ఫంక్షన్లు పెట్టుకున్న వారికి ఎవరు సాయం చేస్తారు? దీనికి సమాధానాలు ప్రభుత్వాలు చెప్పాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర నిర్ణయాలను ఎదిరించలేక, ప్రశ్నించలేక తూచ తప్పకుండా పాటించేది సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాత్రమే. కానీ, ప్రభుత్వాలు మాత్రం వారిపై సీత కన్ను వేస్తుంటారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ నగదు మార్పిడి సంక్షోభం నుండి దేశం బయటపడిన తరువాత అయినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరగతి ప్రజలకు కొంతమేర అయినా ఉరట కల్పించాలని ప్రజానీకం ఆశిస్తుంది.

రాష్ట్రాలు సాయం కోసం ఎలా అయితే కేంద్రం వైపు ఆశగా చూస్తుందో… అలాగే సామాన్యులు కూడా సాయం కోసం రాష్ట్రాల వైపు అంతే ఆశగా చూస్తారు. అది అర్ధం చేసుకొని ప్రభుత్వాలు కూడా కాస్త ఉదాసీనంగా వ్యవహారిస్తే అందరూ ఎదుగుతారు. “ఎదగడం అంటే మనతో పాటు మన తోటి వారు కూడా ఎదగాలి” అని శ్రీమంతుడు సినిమాలో మహేష్ చెప్పినట్లు చేసినట్లయితే… వ్యక్తులు కాదు, వ్యవస్థలు బాగుపడతాయని గుర్తించాలి. మరి కేసీఆర్ గారి వ్యాఖ్యలేమో ‘శ్రీమంతుడు’ లాజిక్ మిస్సయినట్లుగా కనపడుతోంది.