Telangana KCR Covid 19 norms public meetingsలక్ష మంది తో ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్ సభ పై తమ అనుమతి లేకుండా, కరోనా నిబంధనలు పట్టించుకోకుండా.. తమ భూముల్లో సభ నిర్వహిస్తున్నారని కొందరు రైతులు హై కోర్టుని ఆశ్రయించారు.అయితే ఈ పిటిషన్ ను హై కోర్టు రెండు సార్లు తిరస్కరించింది. ఈరోజు ఉదయం హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించారు. దీంతో బుధవారం సీఎం కేసీఆర్ సభ యథావిథిగా కొనసాగనుంది.

ఈ రెండు పర్యాయలలో హై కోర్టు చేసిన వ్యాఖ్యలను రైతులు తప్పుబడుతున్నారు. ఒక సందర్భంగా… రాజకీయ పార్టీలు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయన్న పిటిషనర్‌.. ఏ ఒక్క పార్టీనీ ప్రతివాదిగా చేర్చక పోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఉల్లంఘనలకు ఆధారాలు చూపించకుండా కోర్టునెలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది. సోషల్ మీడియా మొత్తం దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ లో రాజకీయ పార్టీలు కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఫోటోలు, వీడియోలు ఉంటుంటే హైకోర్టు అది లేదు ఇది లేదు అని విచారణ చేపట్టకపోవడమేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు.

కనీసం తమ భూములలో అనుమతి లేకుండా సభ పెడుతున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. అది అలా ఉండగా… ఈ సభను సక్సెస్ చెయ్యడానికి తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ ఉపఎన్నికలో గెలిచి ఈ మధ్య కాలంలో బీజేపీకి వచ్చిన విజయాలు కేవలం గాలి వాటమే అని నిరూపించాలని అధికార పక్షం ఆరటపడుతుంది.