Feel The Jail Telangana, Feel The Jail Museum Telangana, Feel The Jail Telangana Government, Feel The Jail Telangana KCR Scheme, Feel The Jail Museum Rs.500 అసలు జైలు జీవితం ఎలా ఉంటుంది? జైలులో ఉన్న ఖైదీలు ఎలా వ్యవహరిస్తారు? పోలీసులు వారిని ఎలా ట్రీట్ చేస్తారు? ఇలా అనేకానేక ప్రశ్నలు చాలామంది మదిలో కలిగేవే. అయితే ఇవి తెలుసుకోవాలంటే జైలుకెళ్ళాల్సి ఉంటుంది. కానీ, అదేమీ షాపింగ్ మాల్ కాదు కదా… అలా కాసేపు ఆటవిడుపుగా సమయం గడిపి రావడానికి! అలాంటి అవకాశాన్ని కల్పించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది.

జైలు జీవితం ఎలాగుంటుందో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం ‘ఫీల్ ద జైల్’ పేరిట తెలంగాణ జైళ్ల శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. సంగారెడ్డి జైల్ మ్యూజియంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జైలు జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనే వారు ఒక్కరోజు జైలు జీవితం గడపవచ్చని, అందుకుగాను 500 రూపాయలు రుసుకు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు చెప్పారు.

జైళ్లలో నెలకొన్న వాతావరణంపై ఉన్న అపోహలను పోగొట్టే ప్రయత్నంలో భాగంగానే ‘ఫీల్ ద జైల్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. యూనిఫామ్, భోజన వసతితో పాటు ఖైదీలను ఎలా ట్రీట్ చేస్తారో అదే విధంగా ఒక్కరోజు జైలు జీవితం గడిపేవారిని ట్రీట్ చేస్తారన్నారు. జైలు జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్న ముగ్గురు ఔత్సాహికులు ఇప్పటికే డబ్బు చెల్లించారని హెరిటేజ్ జైల్ మ్యూజియం అధికారి తెలిపారు.