Telangana High Court Questions KCR Governmentt on pensionsకరోనా విపత్తు వల్ల ఆర్ధిక వ్యవస్థ కుదేలు కావడంతో ప్రభుత్వాల ఆదాయాలు పడిపోయాయి. దీనితో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల రూపంలో కొత్త ఖర్చులు కూడా వచ్చాయి. ఇందుకోసం కొన్ని రాష్ట్రాలు ఉద్యోగులకు జీతాలు సగమే ఇచ్చి, మిగతా సగం పరిస్థితి మెరుగుపడ్డాకా ఇస్తామని చెప్పాయి. ఈ ప్రక్రియని మొదట ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వమే.

ప్ర‌భుత్వ‌-కాంట్రాక్ట్- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల‌తో పాటు పెన్ష‌న‌ర్లకు కూడా పెన్ష‌న్ చెల్లింపులో తెలంగాణ ప్ర‌భుత్వం కోత పెట్టింది. వ‌య‌స్సు మీద ప‌డిన వారికి ఇలాంటి సమ‌యంలో పెన్ష‌న్ కోత విధిస్తే… వారి ప‌రిస్థితి ఏంటీ…? ఏమైనా జ‌రిగిదే ఎవ‌రికి చెప్పుకోవాలి అంటూ ఒక వ్య‌క్తి దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై హైకోర్టు విచారించింది.

లాక్ డౌన్ స‌మ‌యంలో ఎవైనా అనారోగ్య సమస్యలు వ‌స్తే… పెన్ష‌న‌ర్ల‌కు దిక్కేవ‌రు అంటూ ప్ర‌భుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. అసలు ఏ ప్ర‌తిపాదిక‌న పెన్ష‌న్ లో కోత పెట్టారో చెప్పాలంటూనే, పెన్ష‌న్ దారులందరికీ పూర్తి పెన్ష‌న్ చెల్లించేలా ప్ర‌భుత్వాన్ని ఒప్పించాలంటూ ఏజీకి సూచించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఇదే పద్దతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవలంభిస్తుంది. దీనితో అక్కడి ప్రభుత్వం ఏం చెయ్యబోతుంది అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా… తెలంగాణాలో కరోనా కేసులు 700కు చేరుకున్నాయి. మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో ఇవి 572గా ఉన్నాయి. కేసులు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లో పదకొండు, తెలంగాణలో ఎనిమిది జిల్లాలను హాట్ స్పాట్స్ గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.