KCR Telangana High Courtతెలంగాణలో కరోనా క్రైసిస్ ని సరిగ్గా హేండిల్ చెయ్యడంలో విఫలం అవుతున్న సర్కారుపై హై కోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతుంటే స‌ర్కార్ నిద్ర‌పోతుందా అని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. టెస్టుల్లో ఏపీ, ఢిల్లీ రాష్ట్రాలతో చూసి తెలంగాణ ఎంతో వెనుక‌బ‌డి ఉంద‌ని కోర్టు వ్యాఖ్యానించింది.

త‌మ ఆదేశాల‌ను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడదో చెప్పాల‌ని, కేసు పెట్టి ఎందుకు స‌స్పెండ్ చేయ‌కూడ‌దో చెప్పాల‌ని ఏజీని ప్ర‌శ్నించింది. తాము ప‌దే ప‌దే ప‌లు విష‌యాల‌పై ఆదేశాలు జారీ చేస్తున్న‌ప్ప‌టికీ ఒక్క‌టి కూడా అమ‌లు కావ‌టం లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసే హెల్త్ బులిటెన్లు ఇప్ప‌టికీ పూర్తి సమాచారం ఇవ్వ‌టం లేద‌ని కోర్టు మండిప‌డింది. ప్రజారోగ్యం, భద్రతా ప్రభుత్వానికి పట్టదా అంటూ ప్రశ్నించింది. ఇది ఇలా ఉండగా.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,076కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,224గా ఉన్నాయి.

ఈ వైరస్ కారణంగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 415కి చేరింది. అయితే కొంత కాలంగా కేసులు స్టడీగా ఉండడం… మరణాలు పెద్దగా పెరగకపోయినా చాలా మంది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులను, మరణాలను తగ్గించి చూపుతుందని చాలా మంది అభిప్రాయం.