telangana government allegations over krishna water distributionహైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిని రెండు రాష్ట్రాల లెక్కల్లో వేయాలని తెలంగాణ కోరింది. ఈ అంశాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అజెండాలో పెట్టి చర్చించాలని కోరింది. నగరంలో ఆంధ్ర వాసులు ఎక్కువగా నివసిస్తున్న కారణంగా ఇక్కడ వినియోగించే నీటిని రెండు రాష్ట్రాల లెక్కల్లో వేయాలని తెలంగాణ కోరింది.

ఐతే ఈ వాదన పై ఆంధ్ర ప్రజలు మండి పడుతున్నారు. హైదరాబాద్ లో నివసించే ఆంధ్రవారి నీటి అవసరాలు తెలంగాణా ప్రభుత్వం తీర్చలేకపోతే వారి నుండి పన్నులు ఎందుకు తీస్కుంటున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు? అదే విధంగా హైదరాబాద్ వేరువేరు రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తూ ఉంటారు వారందరి నీటి అవసరాలు వల్ల రాష్ట్రాలే తీరుస్తున్నాయా? అని అడుగుతున్నారు.

పోనీ ఆంధ్రుల నీటి అవసరాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరుస్తే వాళ్ళు నగరంలో కట్టే పన్నులలో ఆంధ్ర ప్రదేశ్ కు వాటా ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెట్ట్‌లర్ల కాళ్ళలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు ఏమైనట్టు?

గతంలో సెట్ట్‌లర్ల పై కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అన్ని మర్చిపోయి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారంతా టీఆర్ఎస్ కు గంపగుత్తుగా ఓట్లు వేసి గెలిపించారు. రెండు సంవత్సరాల లోపే ఎన్నికలు రానున్న నేపధ్యంలో ఇటు వంటి ప్రయత్నాలు మొదటికే చేటు తెస్తాయని తెలుసుకోవడం మంచిది.

గతంలో ఉన్న కృష్ణా బోర్డ్ సెక్రెటరీ ఆంధ్ర ప్రదేశ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించి తెలంగాణా ప్రభుత్వం కొత్త సెక్రెటరీ ని నియమించేలా కేంద్రం పై ఒత్తిడి చేసి సాధించుకుంది. ఈ కొత్త సెక్రెటరీ తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని తెలంగాణా ప్రభుత్వం నమ్మకం. చూడాలి ఏం జరగబోతుందో! హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిని రెండు రాష్ట్రాల లెక్కల్లో వేస్తే మాత్రం అదో రాజకీయ దుమారం రేపడం తధ్యం!