Telangana Public Toilets, Telangana Urban Public Toilets, Telangana Rural Public Toilets, Telangana Free Public Toilets, Telangana Hygine Public Toilets2017 నాటికి తెలంగాణలోని పట్టణ ప్రాంతాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 31, 2017 నాటికి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఐదంచెల యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. నిజానికి ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్‌లో జరిగిన ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లోనే ఓ ప్రకటన చేయాలని అనుకున్నారు.

మొదటి విడతలో భాగంగా మునిసిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికార యంత్రాగం తొలుత 15 మునిసిపాలిటీలను ఎంచుకుని పూర్తిస్థాయిలో టాయిలెట్లు నిర్మించడంపై దృష్టి సారించనుంది. అక్కడ లక్ష్యాన్ని చేరుకున్న అనంతరం మిగతా 42 మునిసిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. రెండో విడతలో భాగంగా 20 మునిసిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించనున్నారు. మరో 11 మునిసిపాలిటీలకు అక్టోబరు 2 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు.

26 మునిసిపాలిటీలకు వచ్చే ఏడాది జనవరి 26, మిగిలిన ఆరింటికి మార్చి 31, 2017 వరకు గడువు ఇచ్చి ఆ లోగా టాయిలెట్ల నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర మూడో ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని వంద శాతం టాయిలెట్లు కలిగిన రాష్ట్రంగా ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణా సర్కార్ పెట్టుకున్న ఈ లక్ష్యం నెరవేరాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు.