Telangana EC suggests at a time election in andhra pradeshతెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ కీలకమైన వ్యాఖ్య చేశారు. ఒకే రోజున ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో ఒకే ధపా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తాము సూచించామని ఆయన తెలిపారు.‘ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం ద్వారా భద్రతాపరమైన ఇబ్బందులు తొలగుతాయి. రెండు చోట్లా ఒకే దఫా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించామని ఆయన తెలిపారు.

దీనివల్ల రెండు రాష్ట్రాలలో ఒటు హక్కు కలిగినవారు రెండు చోట్ల ఓటు వేసే అవకాశం లేకుండా అవుతుంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ తెలంగాణ అధికారులు చేసిన ప్రతిపాదనకు ఒప్పుకుంటే ఇటీవలే కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటి సారి అవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందే జరగడంతో ఇది జరిగే అవకాశం ఉంటుంది. గతంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఈ విషయంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల టీడీపీకి మద్దతుగా ఉండే సెట్లర్లు ఇక్కడా అక్కడా ఓటు వేస్తున్నారని జగన్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీని వల్ల తాము చాలా నష్టపోయామని అప్పట్లో జగన్ అన్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే ఈ నిర్ణయం కీలకం కాబోతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే నెల మొదటి వారం విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతుందని సమాచారం.