telangana cs somesh kumarతెలంగాణలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా వైద్య శాఖా మంత్రి పదవి ఊడిపోయింది. ఆ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే పెట్టుకున్నారు. ఆయన స్థానములో చీఫ్ సెక్రటరీ రోజూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి తాజా పరిస్థితిని వివరించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా తెలంగాణలో అదుపులోనే ఉందని, కొన్ని రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయని, రాష్ట్రంలో వ్యాక్సిన్, ఆక్సిజన్, పడకలకు ఎలాంటి లోటూ లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల వారూ ఇక్కడికే చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. కేసులు, చావులు తక్కువగా చూబిస్తున్నాం అనేదానిలో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో 120 టన్నుల ఆక్సిజన్ రోజూ అవసరమవుతుందని, తాము మాత్రం 400 టన్నుల ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచామని వివరించారు. చీఫ్ సెక్రటరీ చెప్పేదాని బట్టి… పరిస్థితి అంతా బావుంది… మరి ప్రజలలోనే లోపం ఉందా? ట్విట్టర్ ఓపెన్ చేస్తే బెడ్ కావాలని, ఆక్సిజన్ కావాలని, మందులు కావాలని ఇలా మొత్తం అటువంటి రిక్వెస్ట్లతోనే నిండిపోయి ఉంది.

ఇక్కడ అయితే ప్రభుత్వం చెబుతుంది అయినా అబద్ధం అయ్యి ఉండాలి లేకపోతే ప్రజలు చెబుతున్నది అయినా అబద్దం అయ్యుండాలి. కానీ కొరత లేకపోతే… బెడ్ కావాలని, ఆక్సిజన్ కావాలని, మందులు కావాలని సోషల్ మీడియాలో వెతుకులాడటానికి ప్రజలకు ఏం పని?