Clinical-Trials-of-India's-First-Corona-Vaccine-Begins-in-AP-and-TSతెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోవడంతో పాటు… ప్రైవేటు ఆసుపత్రులు రోగులను పీల్చి పిప్పి చేస్తున్న ఘటనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఏమీ చెయ్యడం లేదు అనే భావన కూడా గట్టిగా ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు మొదలుపెట్టకపోవడంతో ఈ ఇష్యూ తెలంగాణ హై కోర్టుకి చేరింది.

ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై వేసిన ఒక పిల్ ని హై కోర్టు స్వీకరించింది. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టుని కోరారు. దీనితో యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ఆసుపత్రులను, ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.

మరోవైపు… ఈ రోజు ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ రాజ్ భవన్ లో ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ పనులలో ఆమె తలదూరుస్తున్నారు అనే కోపంతో ప్రభుత్వం పెద్దలు ఆమెకు సహకరించొద్దు అని అధికారులను ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఆ ప్రకారం రివ్యూ మీటింగ్ కు చీఫ్ సెక్రటరీ, వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళలేదు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నామని రాజ్ భవన్ కు తెలిపారు. దీనితో ఈ విషయంలో కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాలి. మరోవైపు తెలంగాణలో నిన్నటికి మొత్తం కేసులు దాదాపుగా ఇరవై ఆరు వేల కేసులకు చేరాయి.