telangana-congress-contestants-list-on-7th-decemberఒకవైపు 106 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో తెరాస దూసుకుపోతుంటే ప్రధాన ప్రతిపక్షం మాత్రం వెనుకబడిపోతుంది. ఇదిగో అదిగో అని చెబుతున్న కాంగ్రెస్ మొదటి అభ్యర్థుల లిస్టు కనుచూపు మేరలో కనిపించడం లేదు, మహాకూటమి వర్గాలతో సీట్ల పంచాయతీ కూడా తేలడం లేదు.

తాజాగా నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేయనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఖుంతియా పేర్కొన్నారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే మొదటి లిస్టులో పేర్లు ఉండేవారికి గట్టిగా ఒక నెల మాత్రమే ప్రచారానికి సమయం ఉంటుంది. ఈ లెక్కన చివరి జాబితా ఎప్పటికి వచ్చేనో?

వారికి ప్రచారానికి ఏ మాత్రం సమయం దక్కుతుందో? బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాల్సి వచ్చినప్పుడు మన ప్రయత్నం కూడా అదే స్థాయిలో ఉండాలి. అయితే కాంగ్రెస్ లో అది కనిపించడం లేదు. ఇలాగే ఉంటే డిసెంబరు 11న ఓటమికి కారణాలు వెతుకోవాల్సి రావచ్చు. కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు కూడా మునగడం ఖాయం!