Two-Shades-of-TS-Govt's-Commitment-to-Environment-on-A-Single-Dayరెండో సారి అధికారం చేపట్టిన తరువాత కేసీఆర్ మొట్టమొదటి సమ్మెను ఎదురుకోబోతున్నారు. ఆర్టీసి జేఏసీ ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు ఉందని తెలిపింది. తెలంగాణ ఉద్యమం స్థాయికి ఈ బంద్ ని తీసుకుని వెళ్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు.

మరోవైపు సమ్మెకారణంగా విద్యార్దులు ఇబ్బందులు పడకుండా విద్యాసంస్థలకు సెలవులను ఈనెల 19వ తదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. 21న స్కూళ్లు, కళాశాలలు ప్రారంభం అవుతాయి. అప్పటిలోగా పూర్తిస్థాయిలో బస్సులు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు.

ఇది ఇలా ఉండగా సమ్మెలో పాల్గొన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి విధుల్లోకి తీసుకునేది లేదని మరోసారి స్పష్టం చేశారు. సమ్మెకు దూరంగా ఉన్నవారికే సెప్టెంబర్‌ నెల జీతాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం తదుపరి చర్యలతో ఆర్టీసీ రూపు రేఖలు మార్చేస్తామని, కొత్త పద్దతిలో అద్దె ప్రాతిపదికన 30 శాతం బస్సులు నడపనున్నట్లు కేసీఆర్‌ వివరించారు.

20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్‌ పర్మిట్లు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. సమ్మె వల్ల వస్తున్న కొరత నేపథ్యంలో కండక్టర్లు, డ్రైవర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని.. అద్దె బస్సులకు త్వరగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం అధికారులను సూచించారు.