Telangana CM KCR silent on disha rape case #JusticeForDisha ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయం అయ్యింది. ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. పోలీసు వ్యవస్థ కాసేపు కళ్ళు మూసుకుంటే నింధితులను కొట్టి చంపేసేలా ఉన్నారు. దీనితో పబ్లిక్ సెంటిమెంట్ కు అనుగుణంగా సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు ఈ విషయం పై స్పందిస్తున్నారు. కొందరైతే స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని స్వయంగా పరమర్శించి వస్తున్నారు.

నిందితుల కుటుంబాలు కూడా వారిని వదిలిపెట్టొద్దు అని చెప్పడం విశేషం. అయితే ఈ ఉదంతం జరిగిన నాటి నుండీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం విశేషం. ఒక మంత్రి మహమూద్ అలీ ఆమె వాళ్ళ అక్కకు కాకుండా 100కి కాల్ చేసి ఉండాల్సిందని, ఇంకో మంత్రి తలసాని ప్రతీ ఇంటికి ఒక పోలీసును పెట్టగలమా అని వివాదాన్ని రాజేశారు. అయినా ముఖ్యమంత్రి నోరు మేధపలేదు.

ఇది ఇలా ఉండగా బీజేపీ సెంటిమెంట్ ను వాడుకునే ప్రయత్నం చేస్తోంది. గవర్నర్ స్వయంగా వెళ్లి #JusticeForDisha కుటుంబాన్ని పరామర్శించడం గమనార్హం. ఒక గవర్నర్ ఇటువంటి కార్యక్రమానికి వెళ్లడం చాలా అరుదు. మరో వైపు కేంద్ర మంత్రి సంజీవ్ బలియన్ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో బాధిత కుటుంబాన్నీ పరామర్శించి వస్తారు.

రాజకీయ కారణాలు పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఇటువంటి విషయం పై ముఖ్యమంత్రి మిన్నకుండిపోవడం దారుణం. ఈ ఉదంతం నేపద్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ తరుణంలో వారికి భరోసా ఇవ్వవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కి ఎంతైనా ఉంది. అయితే ఎప్పటిలానే కేటీఆర్ తో మొత్తం సీన్ నడిపించి వారసుడికి మైలేజ్ వచ్చేలా చేసే పనిలో పడ్డారు కేసీఆర్ అంటూ పలువురు విమర్శించడం గమనార్హం.

This Story done by a M9.news staffer is not in accordance with the law protecting the privacy of the victim. We sincerely apologise to the people named in this piece as well as to all our readers. We assure the readers that there is no malicious intent in our reporting and it is only a mistake on our part. M9.news adhers to all the laws governing the country. The Mistake has been rectified and with that, the persons responsible. Thank you.