Telangana CM KCR on financial crisis in indiaఆర్ధిక మాంద్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఆర్దిక మాంద్యం లేదని గొప్పలు చెప్పుకుంటోంది కాని, నిజానికి ఆర్దిక మాంద్యం ప్రభావం రాష్ట్రాలపై స్పష్టంగా పడుతోందని అబిప్రాయపడ్డారు. గత ఏడాది కన్నా ఆరు శాతం అదనంగా కేంద్రం నుంచి వాటా వస్తుందని అంచనా వేస్తే ,ఇప్పుడు ఉన్నదానికన్నా తగ్గేలా ఉందని అదికారులు తెలిపారు.

మొత్తం మీద మూడువేల కోట్ల ఆదాయం తగ్గవచ్చని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా అన్ని శాఖలలో బడ్జెట్ కోత పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. మిగులు రాష్ట్రమైన తెలంగాణ లో పరిస్థితి ఇలా ఉంటే లోటు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆర్ధిక మాంద్యం, తగ్గుతున్న కేంద్ర నిధులు, తగ్గుతున్న సొంత ఆదాయాలు వంటి వాటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చర్చ లేదు.

ఆదాయం పెంచుకునే మార్గాలు అయితే అసలే కనిపించడం లేదు. దానికి తోడు అనుయాయులకు లక్షలలో జీతభత్యాలు ఇచ్చే కొలువులు ఇచ్చుకుంటూ పోతున్నారు. పైగా రేపు అనేది లేదు అన్నట్టు రోజుకో కొత్త తాయిలం ప్రకటిస్తున్నారు. రైతు భరోసా, అమ్మ వడి లాంటి పథకాలు బాగా ఖర్చుతో కూడుకున్నవి. పైగా అప్పులు కూడా ఇక పుట్టే అవకాశాలు లేవు.

కేంద్రంలోని పెద్దలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించే పరిస్థితి ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ తరుణంలో రాష్ట్రానికి పరిస్థితులు ఎంతమాత్రం అనుకూలంగా లేవు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తేరుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోక పోతే ముందు ముందు ఇబ్బందే. ఇది జగన్ అధికారం లోకి వచ్చిన మొదటి సంవత్సరం. ఆర్ధిక మాంద్యం ఎదురుకోవడం తలపండిన నేతలకే కష్టం. ఈ తరుణంలో జగన్ ఫెయిల్ అయితే ఆయనకు రాజకీయంగా కుడా ఇబ్బందే.